రివ్యూ: ఫాంటసీ థ్రిల్లర్ 'జై భజరంగి'

రివ్యూ: ఫాంటసీ థ్రిల్లర్ 'జై భజరంగి'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 2.75/5

బ్యానర్:  శ్రీ బాలాజీ వీడియో

నటీనటులు: డా. శివరాజ్ కుమార్, భావన మీనన్, శృతి, సౌరవ్ లోకేష్, శివరాజ్ కె  పేటే,  చెల్వరాజ్, తదితరులు

సంగీతం : అర్జున్ జన్య, సినిమాటోగ్రఫర్:  స్వామి జె. గౌడ, ఎడిటర్: దీపు యస్ కుమార్,
కాస్ట్యూమ్స్ :యోగి జి.  రాజ్, ఫైట్స్:డా. రవి వర్మ, విక్రమ్ మోర్,  ఆర్ట్ డైరెక్టర్:  రవి శాంతే హక్కులూ,
మాటలు :ఏ. సెల్వమ్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్  :  ప్రేమ్ కుమార్,  నిర్మాత: నిరంజన్ పన్సారి,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఏ. హర్ష

విడుదల తేదీ : 29 అక్టోబర్ 2021

కన్నడ  సూపర్ స్టార్ శివరాజ్‌ కుమార్‌ హీరోగా ఏ.హర్ష తెరకెక్కించిన చిత్రం ‘జై భజరంగి 2’. 2013లో వచ్చిన ‘భజరంగి’కి ఈ సినిమా సీక్వెల్‌గా రూపొందింది. తెలుగు లో ఈ చిత్రం బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్‌ పన్సారి నిర్మించారు. పూర్తి స్థాయిలో వి ఎఫ్ ఎక్ష్ ఎఫిస్ట్స్ తో భారీ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :
అంజి ( శివరాజ్‌ కుమార్‌)కి పెళ్లి వయసు దాటిపోతున్నా ఇంకా పెళ్లి కాదు. దాంతో విదేశాల్లో ఉంటున్న అంజి ఇక్కడ వడ్డీ వ్యాపారం చేసే ఓ రౌడీ  అక్క దగ్గరకు వస్తాడు. ఆమె అతనికి పెళ్లి చేస్తానని మాట ఇస్తోంది. ఆ మాట ప్రకారం అంజి పెళ్లి చూపుల ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. మరోపక్క ధన్వంతరి వంశానికి చెందిన వారసులను బానిసలుగా చేసి సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే వనమూలికలతో మత్తు మందులను చేయించి విలన్ గ్యాంగ్ అమ్ముతూ ఉంటుంది. ఈ క్రమంలో భారీ ఎత్తున వ్యాపారం జరగడంతో మానవ వనరులు అవసరమయ్యి అడవికి ఆనుకుని వున్నా వూరిలో పడి బలవంతంగా ఆ గ్రామస్థులను బందించి అంజిని కొట్టి అతని అక్కయ్యను, అతను ప్రేమించే అమ్మాయిని అనుచరులను ఎత్తుకెళ్తారు. ఏం చేయలేని అంజి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అయితే, అతని శరీరంలోకి దేవుడు పేరుతో పిలవబడే  భజరంగి (శివరాజ్‌ కుమార్‌) ఆత్మ ఎలా వచ్చింది ? ఇంతకీ ఈ భజరంగి ఎవరు ? అతనికి – ధన్వంతరి వైద్యానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? చివరకు భజరంగి విలన్ గ్యాంగ్ ను ఎలా అంతమొందించాడు ? అనేది మిగిలిన కథ.

నటి నటుల హావభావాలు
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న డా.శివ రాజ్ కుమార్ ‘ఏమి చేయలేని అంజిలా’, ‘గొప్ప ఆలోచన కలిగిన భజరంగి’లా ఇలా రెండు భిన్నమైన పాత్రల్లో అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్ భావన  ప్రేమలో పడే సీన్ కూడా బాగుంది. అయితే హీరోయిన్ గా ఆమెకు పెద్దగా స్కోప్ లేదు. కానీ ఉన్నంతలో ఆమె అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ముఖ్యంగా దుష్ట పాత్రలో నటించిన చెల్వరాజ్ ఆర్కా పాత్రలో ఒదిగిపోయాడు. ప్రతీ షాట్ లో అతని క్రూరత్వం ఉట్టి పడింది. ఇక మిగిలిన కీలక నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వాళ్ళు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లుగా దర్శకుడు ఏ.హర్ష కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాలను మాత్రం రాసుకోలేదు. దర్శకుడు  చెప్పాలనుకున్న థీమ్ తో పాటు సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉండటం సినిమాకి బాగా ప్లస్ అయింది. వైద్యానికి సంబంధించి ఓ బలమైన ఆశయంతో ఓ వ్యక్తి తన జీవితాన్నే త్యాగం చేసి సమాజానికి సేవ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. బలమైన ఎమోషనల్ సీన్స్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ చాలా బాగా ప్లాన్ చేసాడు.  ఇక స్వామి జె.గౌడ సినిమాటోగ్రఫీ బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాలన్నీ ఆయన చాలా బాగా చూపించారు. సంగీత దర్శకుడు అర్జున్ జ‌న్యా అందించిన నేపథ్య సంగీతం సినిమా ఆధ్యంతం ప్రేక్షకుడిని  థియేటర్ లో కుర్చోపెట్టింది.  పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. దీపు యస్ కుమార్  ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది.  ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

విశ్లేషణ:
భారీ అంచనాలతో, భారీ బడ్జెట్ తో కన్నడ సూపర్  స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ ఫిక్షన్ యాక్ష‌న్ డ్రామాలో.. కొన్ని యాక్షన్ సీక్వెన్స్, నేపథ్యం, భజరంగి పాత్ర, ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్ మరియు శివరాజ్‌ కుమార్‌ నటన అద్భుతంగా వుంది. అయితే ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకోకపోవడం, ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, మెయిన్ కంటెంట్ ను దర్శకుడు స్క్రీన్ మీద బలంగా ఎలివేట్ చేయలేకపోవడం వంటి అంశాలు సినిమాకి కాస్త  మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో ఫైట్స్, ఫాంటసీ సన్నివేశాలు తీసుకున్న బాక్గ్రౌండ్ పీరియాడిక్ మూవీ లా అనిపించినా అక్కడక్కడా కొన్ని లోపాలు కనిపిస్తాయి. ఇదే చిత్రాన్ని తెలుగులో బాల కృష్ణ వంటి హీరో చేసివుంటే బ్లాక్ బస్టర్ మూవీ అయివుండేది. ఈ రోజు విడుదల అయినా మూడు చిత్రాలలో ఓ సపరేట్ మూవీ గా మాస్ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. 

 

Tags :