తక్షణమే అక్కడ యుద్దాన్ని ఆపాలి

యూరప్ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి కేంద్రంలోని మోదీ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. తాజాగా విదేశాంగ మంత్రి జై శంకర్ ఇటలీ విదేశాంగ మంత్రి లుయిగి డీ మయోతో చర్చలు జరిపారు. ప్రధానంగా ఉక్రెయిన్ సంక్షోభం, వాతావరణ మార్పులపై సహకారం, రోదసీ సహకారంపై ఇరువురు చర్చించారు. ఉక్రెయిన్లో నెలకొన్న మానవతా సంక్షోభం పట్ల ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అక్కడ యుద్దాన్ని ఆపాలని కోరారు. ఇంధన పరివర్తనపై భారత్, ఇటలీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అమలుపై ఇరువురు చర్చించారు. జి`20తో సహా బహుళపక్ష వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ఇండో పసిఫిక్ రీజియన్లో సహకారంపై ఇరు పక్షాలు చర్చించాయి. వచ్చే ఏడాది భారత్ స్థానంలో జి-20 సమావేశాల నిర్వహణకు ఇటలీ అంగీకరించింది. సమావేశానంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా ప్రకటన చేసినా, ఇటలీ మంత్రి రష్యాను విమర్శిస్తూ ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.