తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి నన్ను నడిపిస్తోంది

తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి నన్ను నడిపిస్తోంది

తెలంగాణ ప్రజలకు నేను రుణపడి ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌లో జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ పోరాటం చేస్తేనే అడుగు వేయగలమని అన్నారు. భయపెట్టి కొద్దీ బలపడతాం తప్ప భయపడే ప్రసక్తే లేదని అన్నారు. రాజకీయాల్లోకి వస్తుంటే అందరూ నన్ను భయపెట్టారు. తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చిందన్నారు. 2009లో రాజకీయాలు నా ఆధీనంలో లేవు. అప్పుడు పార్టీ వేరొకరి చేతిలో ఉంది. రాజకీయ చదరంగంలో జనసేనది సాహసోపేత అడుగు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి నన్ను నడిపిస్తోంది. రాజకీయాలకు బలమైన భావజాలం ఉంటే చాలు అన్నారు. తెలంగాణ భాషను, యాసను తాను గౌరవిస్తున్నానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కులాల కొట్లాటతో దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యం, అవినీతి, పేదరికమే జనసేనకు బద్దశత్రువులని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకులను తెలంగాణ నాయకులు బద్దశత్రువులుగా చూశారని విమర్శించారు.  ఏపీలో వైసీపీ నాయకులు తనకు శత్రువుల కాదని, సమస్యలు మాత్రమే శత్రువలని పేర్కొన్నారు. ఏ మతంపై దాడి జరిగినా ఖండిస్తానని అన్నారు.

 

Tags :