హుషారెత్తిస్తున్న 'జనని' సాంగ్

హుషారెత్తిస్తున్న 'జనని'  సాంగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్  మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు రాజమౌళి. జనని సాంగ్ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ మెగా, నందమూరి అభిమానులను హుషారెత్తిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్  మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు రాజమౌళి. జనని సాంగ్ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ మెగా, నందమూరి అభిమానులను హుషారెత్తిస్తున్నాయి.చిత్రంలోని 'జనని' రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రాజమౌళి చేసిన కామెంట్స్  ఆర్ఆర్ఆర్ మూవీపై  ఉన్న ఆతృతను అమాంతం పెంచేశాయి.

ఈ సినిమాలో హై థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయని, హీరో ఇంట్రడక్షన్స్, ఇంటర్వెల్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ సీక్వెన్సెస్, క్లైమాక్స్ సీన్స్ ఇలా అన్నింటిలో అంతర్లీనంగా ఓ ఎమోషన్ డ్రైవ్ చేస్తుంటుందని చెప్పి ఇరువురి అభిమానులను హూషారెత్తించారు జక్కన్న. సినిమా సోల్ మొత్తం ఆ ఎమోషనల్ లోనే దాగి ఉంటుందని అన్నారు. థియేటర్స్‌లో చూశాక ప్రేక్షకులు చాలా థ్రిల్ అవుతారని అన్నారు.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, రామ్ చ‌ర‌ణ్‌ జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు. శ్రీయ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ RRR (రౌద్రం రుధిరం ర‌ణం) సినిమాను జనవరి 7వ తేదీన భారీఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

Tags :