మేం బీజేపీతోనే ..బద్వేల్ లో బీజేపీ గెలుపు కోసం

మేం బీజేపీతోనే ..బద్వేల్ లో బీజేపీ గెలుపు కోసం

తాము బీజేపీతో కలిసే ఉన్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బద్వేల్‌ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు కోసం సహకరిస్తామని ప్రకటించారు. పార్టీ స్టాండ్‌ ప్రకారమే బద్వేలులో తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని తెలిపారు. రైతులను ప్రతీ విషయంలో ప్రభుత్వం మభ్యపెడుతూ మోసం చేస్తోందని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టు గురించి సీఎం జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.

 

Tags :