తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ.. ఇప్పుడు పార్లమెంట్.. నెక్ట్స్ అసెంబ్లీనే టార్గెట్

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ.. ఇప్పుడు పార్లమెంట్.. నెక్ట్స్ అసెంబ్లీనే టార్గెట్

తెలంగాణ రాష్ట్రం రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నట్లు జనసేన అధికనేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. జగిత్యాలలో జరిగిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశంలో పవన్ ఈ మేరకు ప్రకటించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణకు స్వాతంత్ర్యం నుంచి సాధన వరకు ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారని, వాళ్లు చేసిన పోరాటాల నుంచి తాను స్ఫూర్తి పొందానన్నారు. అలాంటి తెలంగాణ గడ్డపైనే ఊపిరి పోసుకున్న పార్టీ జనసేన అని, అందుకే ఈ సారి ఎన్నికల్లో తెలంగాణలో కూడా 7 నుంచి 14 లోక్‌సభ స్థానాలల్లో పోటీ చేయబోతున్నామన్నారు. 

అంతేకాకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా పవన్ మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అడుగుపెట్టాలని అనుకుంటున్నానని, తమతో ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషంగా స్నేహ హస్తం కలుపుతామన్నారు. కనీసం 10 మంది అసెంబ్లీలో ఉండేలా చూసుకుంటానని, పొత్తు కోసం వచ్చే పార్టీతో కూర్చొని మాట్లాడుకుని మద్దతు ప్రకటిస్తానని అన్నారు. మరి తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన అడుగుపెట్టబోతున్న ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారబోతున్నాయో చూడాలి.

 

 

Tags :