రేఖారెడ్డికి జపాన్ ప్రభుత్వ పురస్కారం

రేఖారెడ్డికి జపాన్ ప్రభుత్వ పురస్కారం

హైదరాబాద్‌కు చెందిన జపాన్‌ పూల అలంకరణ కళానిపుణురాలు గవ్వా రేఖారెడ్డి జపాన్‌ విదేశాంగ మంత్రి ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యారు. తమ కళ ద్వారా భారత్‌-జపాన్‌ల మధ్య సాంస్కృతిక మార్పిడి, సుహృద్భావ, స్నేహ సంబంధాలకు దోహదపడినందుకు గాను ఆమె ఈ పురస్కానికి ఎంపిక చేసినట్లు చెన్నైలోని కాన్సులేట్‌ కార్యాలయం వెల్లడిరచింది. త్వరలో చెన్నై లోని జపాన్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో ఈ పురస్కారాన్ని ఆమెకు అందజేస్తారు. జపాన్‌ ప్రభుత్వం తమ దేశానికి అనుబంధ కళలు, సేవలు అందించే వారిని గుర్తించి ప్రతియేటా పురస్కారాలు అందిస్తుంది.

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫుడ్‌, న్యూట్రిషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన రేఖారెడ్డి తన తల్లి శ్యామల, నిపుణుడైన మీనా అనంతనారాయణ్‌ వద్ద జపాన్‌ పూల అలంకరణ కళను నేర్చుకున్నారు. మూడు దశాబ్దాలుగా ఆమె దాదాపు పదివేల మందికి  శిక్షణ ఇచ్చారు. ఒహరా ఇకెబానా హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షురాలిగా పని చేశారు. ఫిక్కీ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

 

Tags :