అమెరికా, జపాన్ సంయుక్త ప్రకటన.. భారత్ తో కలిసి

అమెరికా, జపాన్ సంయుక్త  ప్రకటన.. భారత్ తో కలిసి

భారత్‌, ఆస్ట్రేలియాతో కలిసి ఇండో పసిఫిక్‌ ప్రాంతానికి ప్రయోజనం కలిగించే ఓ బలమైన శక్తిగా కొనసాగేలా క్వాడ్‌ను బలోపేతం చేస్తామని అమెరికా, జపాన్‌ పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రదాని కిషిద శ్వేతసౌధంలో సమావేశమయ్యారు. అనంతరం సంయుక్త  ప్రకటన విడుదలైంది. విడదీయరాని ద్వైపాక్షిక సంబంధాలే మా ఇరు దేశాలకు పునాది. దీన్ని ఆధారంగా ఇండో పసిఫిక్‌,  ప్రపంచ ప్రయోజనాల కోసం మేం. ఈ ప్రాంతంలో, వెలుపల కూడా ఇతరులతో సకహరిస్తాం. ఆస్ట్రేలియా, భారత్‌తో కలిసి క్వాడ్‌ ఒక శక్తిగా కొనసాగేలా చూస్తాం అని అందులో పేర్కొన్నారు.   ఇండో`పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేస్తూ స్వేచ్ఛాయుత సముద్ర వాణిజ్యం కొనసాగేలా చేయడమే లక్ష్యంగా క్వాడ్‌ ఏర్పడిరది.  క్వాడ్‌లో అమెరికా, జపాన్‌తో పాటు  భారత్‌, ఆస్ట్రేలియాలు సభ్యదేశాలు.

 

 

Tags :