ఆదరణ కింద జయ్ తాళ్ళూరి సహాయం

ఆదరణ కింద జయ్ తాళ్ళూరి సహాయం

తానా ఫౌండేషన్‌ చేపట్టిన ‘ఆదరణ’ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్‌ మండలం, కండ్లకోయ గ్రామానికి చెందిన పూజిత వల్లంకొండ అనే ఇంజనీరింగ్‌ విద్యార్థినికి జయ్‌ తాళ్ళూరి లాప్‌ టాప్‌ బహుకరించారు.

డిసెంబర్‌ 26న హైదరాబాద్‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సహాయం చేసారు. తానా ఫౌండేషన్‌ ట్రస్టీ రవి సామినేని మరియు తెలంగాణ ట్రిబ్యునల్‌ జడ్జి పూర్ణచందర్‌ తాళ్ళూరి చేతులమీదుగా పూజితకి లాప్టాప్‌ అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి వంశీ వల్లూరుపల్లి తదితరులు పాల్గొన్నారు. పూజిత ఈ సందర్భంగా జయ్‌ తాళ్ళూరి మరియు తానా ఫౌండేషన్‌ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసింది.

 

Tags :