ఘనంగా జరిగిన జయరామ్ కోమటి బర్త్ డే వేడుకలు

ఘనంగా జరిగిన జయరామ్ కోమటి బర్త్ డే వేడుకలు

తానా మాజీ అధ్యక్షుడు, కమ్యూనిటీ నాయకుడు, జయరామ్‌ కోమటి పుట్టినరోజు వేడుకలను బే ఏరియాలోని మిల్‌పిటాస్‌లో ఉన్న స్వాగత్‌ రెస్టారెంట్‌లో ఘనంగా నిర్వహించారు. బే ఏరియాలోని ఆయన అభిమానులు, తానా నాయకులు, బాటా నాయకులు, ఇతర మిత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరామ్‌ కోమటి కేక్‌ కట్‌ చేసిన తరువాత అభిమానులు ఆయనకు కేక్‌ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వీరు ఉప్పల, విజయ ఆసూరి, ప్రసాద్‌ మంగిన, శ్రీనివాస్‌ వల్లూరిపల్లి, హరి గక్కాని, రజనీకాంత్‌ కాకర్ల, భక్తబల్లా, భరత్‌ ముప్పలనేని, కృష్ణ గొంప, రామ్‌ తోట, వెంకట్‌ కోగంటి, సతీష్‌ చిలుకూరి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

Click here for Event GalleryTags :