కవితకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారు.. అర్వింద్ మాటలనే పలికిన జీవన్ రెడ్డి

కవితకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారు.. అర్వింద్ మాటలనే పలికిన జీవన్ రెడ్డి

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మినీ వార్ నడుస్తున్న యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవితకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కవిత గెలిస్తే తమపై ఆధిపత్యం చలాయిస్తుందన్న ఆలోచనతో వారు కావాలని ఆమెను ఓడించారని, అదే పార్టీ ఎమ్మెల్యేలకు పడిన ఓట్లు కవితకు ఎందుకు పడవని, పడలేదని ఎద్దేవా చేశారు. కవితను కనపడకుండా చేయాలని చూసింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని, అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోలేక పోయారిన ఎద్దేవా చేశారు. దాంతో పాటుగా నిజామాద్ పార్లమెంట్ ఎలక్షన్స్‌లో రైతుల చేత నామినేషన్లు దాఖలు చేయించింది బీజేపీ పార్టీనే అని, ఆ నామినేషన్‌లు కాంగ్రెస్ వేయించి ఉంటే వారంతా బీజేపీలో ఎందుకు చేరుతారని అడిగారు. అయితే ఇటీవల ఇదే తరహా వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కవితను పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలే కావాలని ఓడించారని ఆరోపించారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.