MKOne TeluguTimes-Youtube-Channel

అధ్యక్ష ఎన్నికల బరిలో జో బైడెన్ : జిల్

అధ్యక్ష ఎన్నికల బరిలో జో బైడెన్ : జిల్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి 2024 ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారని అమెరికన్లు తెలుసుకోవాలని ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్‌ వెల్లడించారు. నమీబియా, కెన్యా పర్యటనలు ముగించుకొన్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ వయోభారం కారణాలతో 2024 ఎన్నికల బరిల నుంచి బైడెన్‌ వైదొలగుతారనే ప్రచారాన్ని జిల్‌ కొట్టి పారేశారు. బైడెన్‌ త్వరలోనే తన ప్రచార కార్యక్రమాల వివరాలు వెల్లడిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. తాను కూడా దానికి మద్దతుగా నిలుస్తానని వెల్లడించారు.

 

Tags :