వచ్చే వారం జో బైడెన్, బోరిస్ భేటీ

వచ్చే వారం జో బైడెన్, బోరిస్  భేటీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍, బ్రిటన్‍ ప్రధానమంత్రి  బోరిస్‍ జాన్సన్‍ వచ్చే వారం భేటీ కానున్నారు. వర్చువల్‍ సమావేశం నిర్వహించాలని ఇద్దరు నేతలు నిర్ణయించినట్లు శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. అఫ్గాన్‍ నుంచి తమ పౌరులను, యుద్ద ప్రయత్నంలో సహకరించిన అఫ్గాన్‍ జాతీయులను తరలించడంలో తమ సేనలు చూపిన తెగువ, చొరవలను నేతలిద్దరూ ప్రశంసించినట్లు తెలిపింది. ఇతర ప్రజాస్వామ్య దేశాలతో కలిసి అఫ్గాన్‍ పరిణామాలపై నిఘా కొనసాగించాలని, అక్కడున్న శరణార్థులు, పౌరుల రక్షణకు మానవతాదృక్పథంతో ప్రపంచ సమాజం సాయం అందించాలని ఇరువురు నేతలు చర్చల ద్వారా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

Tags :