MKOne TeluguTimes-Youtube-Channel

ఆయన మరోసారి అమెరికా అధ్యక్షుడు కావొచ్చేమో ..బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆయన మరోసారి అమెరికా అధ్యక్షుడు కావొచ్చేమో ..బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆయన మరోసారి అమెరికా అధ్యక్షుడు కావొచ్చేమో అని ఓ ర్యాలీలో సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ర్యాలీకి హాజరైన ప్రజలు తమ అసమ్మతిని తెలుపుతూ కేకలు వేయగా, తండ్రీ నన్ను ఆశీర్వదించు అని బైడెన్‌ అన్నారు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో తన బడ్జెట్‌ ప్రతిపాదన గురించి ప్రసంగించిన బైడెన్‌ 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తనకు, ట్రంప్‌నకు మధ్య నెలకొన్న తీవ్ర పోటీని గుర్తు చేసుకున్నారు. అధ్యక్ష పదవి కోసం నేను మాజీ అధ్యక్షుడితో పోటీ పడిన సందర్భం మీకు గుర్తుండే ఉంటుంది.  ట్రంప్‌ మరో సారి అధ్యక్షుడిగా ఎన్నిక కావొచ్చేమో అని వ్యాఖ్యానించారు. 

 

 

Tags :