నిరుద్యోగంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు

నిరుద్యోగంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగ సమస్యపై ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొన్నిరోజుల క్రితం అమెరికాలో నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వీటిపై తాజాగా స్పందించిన బైడెన్.. అమెరికాలో నిరుద్యోగ సమస్య చాలా తక్కువగా ఉందన్నారు. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం తగ్గిపోయిందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ సమస్య అత్యల్పంగా 3.4 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. అమెరికాలో డెమొక్రటిక్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు కోటి ఉద్యోగాలు కల్పించామని, ఇప్పటివరకూ ఏ అధ్యక్షుడి హయాంలోనూ ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగలేదని బైడెన్ చెప్పారు. ఒక్క ఆగస్టు నెలలోనే 3.15లక్షల మందికిపైగా ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. జులై నెలలో కూడా 5.26లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయని గణాంకాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే గత నెలలో 3.7 శాతంగా ఉన్న నిరుద్యోగిత 3.4 శాతానికి పడిపోయిందని బైడెన్ పేర్కొన్నారు.

 

 

Tags :