జో బైడెన్ మరో కీలక నిర్ణయం..

జో బైడెన్ మరో కీలక నిర్ణయం..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న విద్యార్థుల రుణాల మాఫీ పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా 1.25 లక్షల డాలర్ల కంటే తక్కువ వార్షిక ఆదాయమున్న వారికి 10 వేల డాలర్ల విద్యార్థి రుణాలను మాపీ చేస్తానంటూ ప్రకటించారు. న్యాయపరమైన అడ్డంకుల్ని తట్టుకుని ఈ పథకం అమల్లోకి వస్తే లక్షలాది మంది అమెరికా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అలాగే ఆర్థికంగా వెనకబడ్డవారికి అదనంగా మరో 10 వేల డాలర్ల దాకా రుణ మాఫీ అందనుంది. 

అమెరికాలో 4.3 కోట్ల మంది పైచిలుకు మంది సగటున ఒక్కొక్కరు 37 వేల డాలర్ల చొప్పున విద్యార్థి రుణాలు తీసుకున్నారు. బైడెన్‌ నిర్ణయంతో వీరిలో కనీసం 2 కోట్ల మంది రుణాలు పూర్తిగ రద్దవుతాయని అంచనా. చదువుకునేందుకు విద్యార్థి రుణాలపై ఎక్కువగా ఆధారపడే నల్ల జాతి అమెరికన్లకు ఈ పథకంతో మేలు జరుగుతుందని సమాచారం.

 

Tags :