తాలిబన్ లు సహకరిస్తేనే గడువులోగా : జో బైడెన్

తాలిబన్ లు సహకరిస్తేనే గడువులోగా : జో బైడెన్

అఫ్గాన్‍ నుంచి విదేశీయులు, శరణార్థులను ఈ నెల 31లోగా బయటకు తరలించేందుకు తాము కృషి చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ తెలిపారు. శ్వేతసౌధంలో బైడెన్‍ మీడియాతో మాట్లాడుతూ అయితే తాలిబన్లు సహకరిస్తేనే గడువులోగా ఆ చర్యలు పూర్తవుతాయని పేర్కొన్నారు. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నవారు కాబూల్‍ విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా తాలిబన్లు సహకరించాలని సూచించారు. తరలింపు చర్యలు ఆలస్యమయ్యే కొద్దీ అఫ్గాన్‍ గడ్డపై తమ బలగాలకు ముప్పు పెరుగుతుందన్న సంగతి తనకు తెలుసునన్నారు. ఐఎస్‍ఐఎస్‍కే వంటి ఉగ్ర సంస్థలు అక్కడ దాడులకు కుట్ర పన్నే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

Tags :