20 ఏళ్ల మిలిటరీ ఆపరేషన్ ముగిసింది

20 ఏళ్ల మిలిటరీ ఆపరేషన్ ముగిసింది

అఫ్ఘానిస్థాన్‍లో తమ దేశం చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‍ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ ప్రకటించారు. అమెరికన్ల మరిన్ని ప్రాణాలు పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్‍ సమర్థించుకున్నారు. మిలటరీ లోని అన్ని విభాగాల జాయింట్‍ చీఫ్స్ సిఫారసు మేరకే ఆగస్టు 31కి అక్కడి నుంచి తమ దళాలను పూర్తిగా వెనక్కి రప్పించామన్నారు. అఫ్ఘన్‍లోని తాలిబన్లపై అమెరికా సాగించిన 20 ఏళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ తమ దేశ సైనిక బలగాల చిట్టచివరి విమానం కాబూల్‍ నుంచి బయలుదేరిన కొన్ని గంటల తర్వాత బైడెన్‍ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Tags :