ఆయన ఆటలు సాగనివ్వం : జో బైడెన్

ఆయన ఆటలు సాగనివ్వం : జో బైడెన్

అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోపించారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్‌ హాల్‌లో బైడెన్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిపక్ష రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు. అధికారం దక్కించుకోడానికి దుర్బుద్దితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్గిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. తీవ్రవాదులను కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు అజెండా అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పేనని తేల్చి చెప్పారు. వారి దుశ్చర్యంల వల్ల సమానత్వం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, అధికారమే పరమావధిగా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన అనుచరుల ఆటలు సాగవని హెచ్చరించారు. నాయకుడి పట్ల గుడ్డిగా విధేయత ప్రకటించడం, రాజకీయ హింసలో పాల్గొనడం వంటివి ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయన్న సత్యాన్ని చరిత్ర మనకు నేర్పుతోందన్నారు.

 

Tags :