ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా

ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా

అమెరికా ఆర్థిక మాంద్యం వైపు పరుగులు తీస్తోందేమోనని యుఎస్‌ అధికారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐతే అదేమీ ఉండదని, బయపడవలస్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వారం తరువాత వచ్చే జీడీపీ గణాంకాలు వరుసగా రెండవ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పడిపోతున్నట్లు చూపవచ్చు అని చెప్పారు. ఈ మేరకు బైడెన్‌ మాట్లాడుతూ మేము ఆర్థిక మాంద్యంలో ఉండకపోవచ్చునని  భావిస్తున్నా. మేము వేగవంతమైన వృద్ధి నుంచి స్థిరమైన వృద్ధి వైపు వెళతాము. అంతే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో తిరోగమనం అనేది అసంభవం అని బైడెన్‌ తేలిచ్చా చెప్పారు. అదీ కాకుండా ఆర్థికవేత్తల ఏకాభిప్రాయ సూచన ఇప్పటికే స్వల్ప వృద్ధిని కోరుతోందని ఆయన తెలిపారు.

 

Tags :