అక్కడే తమ బలగాలు... అవసరమైతే అదనంగా

అక్కడే తమ బలగాలు... అవసరమైతే అదనంగా

అఫ్గానిస్తాన్‍లో ఉన్న తమ దేశస్తులందరి తరలింపు పూర్తి అయ్యేంత వరకు అక్కడే తమ బలగాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ ప్రకటించారు. అవసరం అయితే అదనపు బలగాలు కాబూల్‍కు పంపిస్తామన్నారు. అక్కడి గందరగోళ పరిస్థితులను నివారిస్తామన్నారు. కాబూల్‍ నుంచి అమెరికా బలగాల తరలింపునకు 31 డెడ్‍ లైన్‍గా విధించామన్నారు. పరిస్థితి మరింత జటిలం కావడంతో అమెరికన్‍ల తరలింపు పూర్తి అయ్యేంత వరకు ఎంతకాలమైనా తమ సైనికులు అక్కడే ఉంటారని బైడెన్‍ స్పష్టం చేశారు. కాబూల్‍ విమానాశ్రయం అమెరికా బలగాల ఆధీనంలో ఉందన్నారు. తరలింపు పక్రియ అంత సులభం కాదని చెప్పుకొచ్చారు. ఎలాంటి ఉద్రిక్తత లేకుండా ఈ పక్రియ ఎలా సాగుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. తాలిబన్ల తమ దేశ బలగాలకు సహకరిస్తున్నారని తెలిపారు. ఒక్క అమెరికన్‍ని కూడా అక్కడ ఉండనివ్వబోమని, అంటే తాలిబన్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా తాము దాదాపు పక్కనపెట్టినట్టు అని చెప్పారు.

 

Tags :