స్వలింగ వివాహాలకు చట్టబద్ధత బిల్లుపై జోబైడెన్ సంతకం

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత బిల్లుపై జోబైడెన్ సంతకం

స్వలింగ సంపర్కుల వివాహాలకు అమెరికాలో చట్టబద్ధత లభించింది. ఇందుకు సంబందించిన బిల్లు ( సేమ్‌ సెక్స్‌  మ్చారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్‌) పై అధ్యక్షుడు జో  బైడెన్‌ సంతకం చేశారు. దీంతో బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ చట్టం ద్వారా సమానత్వం దిశగా అమెరికా మరో అడుగు వేసిందని జో బైడెన్‌ పేర్కొన్నారు. స్వేచ్ఛ, న్యా యం కొందరిది కాదని, అందరి సొంతమని చెప్పే విధంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. బైడెన్‌ సంతకంతో స్వలింగసంపర్కులు సంతోషంలో మునిగిపోయారు.

 

Tags :