ప్రజాస్వామ్యానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయ్ : జో బైడెన్

ప్రజాస్వామ్యానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయ్ : జో బైడెన్

తమ దేశంలోనూ ప్రజాస్వామ్యానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. శ్వేతసౌధ ప్రతినిధుల సంఘం విందుకు బైడెన్‌ హాజరై ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ శాంతి, స్థిరత్వం, సౌభాగ్యానికి బాటలు పరిచిన లిబర్‌ ప్రపంచ పాలనా విధానంపై ప్రస్తుతం తీవ్ర దాడి చోటు చేసుకుంటోందని అన్నారు. గత ఆరేళ్లలో ఆ కార్యక్రమానికి హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడు ఆయనే. 2020, 2021ల్లో కొవిడ్‌ విజృంభణ కారణంగా విందును రద్దు చేశారు. అంతుకుమందు దేశాధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ కార్యక్రమానికి ఎన్నడూ హాజరు కాలేదు. పలు వినోద కార్యక్రమాలతో విందు కోలాహలంగా జరిగింది. కొవిడ్‌ బారిన పడటంతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ హాజరు కాలేకపోయారు.

 

Tags :