జో బైడెన్ కార్యాలయంలో సంచలనం

జో బైడెన్ కార్యాలయంలో సంచలనం

ఒరాబ్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కొన్ని రహస్య పత్రాలు నాటి ఉపాధ్యక్షుడైన జో బైడెన్‌ ఉపయోగించిన ఓ కార్యాలయంలో బయటపడటం సంచలనం రేపింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం వర్గాలు ప్రకటించాయి. అవి కొద్ది సంఖ్యలోనే ఉన్నాయని, వాటి విషయంలో నేషనల్‌ ఆర్కైవ్స్‌ న్యాయశాఖలకు శ్వేతసౌధం పూర్తిగా సహకరిస్తోందని అధ్యక్షుడి ప్రత్యేక న్యాయవాది రిచర్డ్‌ సౌబర్‌ తెలిపారు. వాషింగ్టన్‌ డీసీలో ని పెన్‌ బైడెన్‌ సెంటర్‌లో గల కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేయడానికి అక్కడున్న బీరువాలో పైళ్లను అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాదులు ప్యాక్‌ చేస్తుండగా ఇవి బయటపడ్డాయని సౌబర్‌ తెలిపారు. 2017 మధ్య నుంచి 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలయ్యే వరకూ ఈ కార్యాలయాన్ని బైడెన్‌ వాడుకున్నారు. రహస్య పత్రాలుననట్లు తెలియగానే అంటే 2022 నవంరు 2నే ఈ విషయాన్ని నేషనల్‌ ఆర్వైవ్స్‌కు చెప్పామని సౌబర్‌ అన్నారు. వాటిని ఆ మర్నాడే ఆ సంస్థ తీసుకుందని తెలిపారు. అధ్యక్షుడి న్యాయవాదులే వీటిని కనుగొన్నారు తప్ప ఆర్వైవ్స్‌ వీటిపై ఎలాంటి విచారణా చేయలేదని స్పష్టం చేశారు.  అప్పటి నుంచి న్యాయశాఖతో పాటు నేషనల్‌ ఆర్కైవ్స్‌కు సైతం పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు.

 

 

Tags :