బైడెన్ సలహా మండలిలోకి రిచర్డ్ వర్మ!

బైడెన్ సలహా మండలిలోకి రిచర్డ్ వర్మ!

భారతీయ అమెరికన్‌ న్యాయవాది, దౌత్యవేత్త, రిచర్డ్‌ వర్మ (53)ను తన ఇంటెలిజెన్స్‌ సలహా మండలిలో చేర్చుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈయన 2014-17లో భారతదేశానికి అమెరికా రాయబారిగా కూడా పని చేశారు. బైడెన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడైన వర్మ ప్రస్తుతం మాస్టర్‌కార్డ్‌కు గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.

 

Tags :