ఆసియాన్ నేతలతో జో బైడెన్ భేటీ

ఉక్రెయిన్, రష్యా ఘర్షణ నేపథ్యంలో ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) శిఖరాగ్ర సమావేశాన్ని వచ్చే నెల 12, 13 తేదీల్లో వాషింగ్టన్లో అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహించనున్నారు. రష్యాపై అమెరికా ఆంక్షలు పెద్దగా ఫలితం ఇవ్వకపోవడం, చాలా దేశాలు అమెరికా వైఖరిని సమర్థించేందుకు నిరాకరిస్తుండడంతో బైడెన్ ప్రాంతీయ కూటములను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటు. ఈ సమావేశం మార్చి 28, 29 తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ, ఉక్రెయిన్పై ఈ కూటమిలో సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడంతో వాయిదా వేశారు. 2021 అక్టోబరులో జరిగిన సమావేశానికి బైడెన్ హాజరై కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆసియాన్ దేశాలకు సహకరిస్తామని ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలిపోయింది.
Tags :