కీవ్ కు జో బైడెన్ ?

ఉక్రెయిన్‌కు సంఫీుభావంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో రాజధాని కీవ్‌లో పర్యటించే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా అమెరికాకు చెందిన కీలక నాయకులు కీవ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ కీవ్‌లో పర్యటించి ఉక్రెయిన్‌కు మరింత సాయం అందిస్తామని ప్రకటించారు. అక్కడి నుంచి సరిహద్దున ఉన్న పోలండ్‌కు చేరుకున్నారు. వార్సాలో అధ్యక్షుడు ఆంద్రజెజ్ దుడాతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌కు అండగా నిలిచి ఉదారంగా సాయం చేస్తుండటాన్ని ప్రశంసించారు. రష్యా యుద్ధం మొదలైన తరువాత 55 లక్షల మంది వలసవెళ్లారని, వారిలో 30 లక్షల మంది కేవలం పోలండ్‌లోనే తలదాచుకున్నారని, ఇంత మందికి ఆశ్రయం ఇవ్వడం సాధారణ విజయం కాదని ఆమె అన్నారు. నాటో విస్తరణ అంశంపై ఇరువురు విసృతంగా చర్చించారు.
Tags :