అదే జరిగితే అమెరికా, రష్యా సంబంధాలు మరింత

అదే జరిగితే అమెరికా, రష్యా  సంబంధాలు మరింత

అమెరికా, రష్యా మధ్య మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. ఉక్రెయిన్‌పై దాడి యత్నాలు మానుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తేల్చి చెప్పారు. కాదని సైనిక చర్యకు దిగితే మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.  అదే జరిగితే అమెరికా, రష్యా  సంబంధాలు మరింత బలహీనపడుతాయని పుతిన్‌ సైతం దీటుగా స్పందించారు. ఈ మేరకు పుతిన్‌కు బైడెన్‌ ఫోన్‌ చేయగా గంట పాటు వారి మధ్య సంభాషణ జరిగింది. అనంతరం రెండు దేశాలు ప్రకటనలు విడుదల చేశాయి. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు తగ్గించాలని పుతిన్‌ బైడెన్‌ కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తే, మిత్ర దేశాలతో కలిసి అమెరికా తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు అని శ్వేతసౌధం కార్యదర్శి జెన్‌ సాకి తెలిపారు. అమెరికా మరిన్ని ఆంక్షలు విధిస్తే అది పెద్ద తప్పే అవుతుందని, ప్రతీగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్‌కు పుతిన్‌ తేల్చి చెప్పారు అని రష్యా అధ్యక్షుడి విదేశీ వ్యవహారాల సలహాదారు యూరి ఉషకోవ్‌ తెలిపారు.

 

Tags :