వారి ఒప్పందం కోసం చైనా ప్రయత్నం : జో బైడెన్

వారి ఒప్పందం కోసం చైనా ప్రయత్నం : జో బైడెన్

తాలిబన్లతో ఒప్పందం కోసం చైనా ప్రయత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ అన్నారు. అమెరికా నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో ఉన్న తాలిబన్లకు చైనా నుంచి నిధులు వెళ్లడంపై ఆందోళన చెందుతున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ చైనాకు నిజమైన సమస్యలు తాలిబన్ల తోనే వస్తాయి. అందుకనే వారు తాలిబన్లతో ఒప్పందంతో కోసం ప్రయత్నిస్తారు. పాకిస్థాన్‍, రష్యా, ఇరాన్‍లు కూడా ఇలానే చేస్తాయని నమ్ముతున్నాను. వారందరు ఇప్పుడేం చేయగలరో అదే చేస్తారు అని సమాధానం ఇచ్చారు. ఇప్పటికే అమెరికా, దాని ఏడు మిత్రదేశాలు సమన్వయంగా వ్యహరించే విషయంపై ఏ అంగీకారానికి వచ్చాయి. అఫ్గాన్‍ విదేశీ మారక ద్రవ్య రిజర్వును తాలిబన్లు వినియోగించుకోకుండా అమెరికా బ్లాక్‍ చేసింది. తొలుత అఫ్గాన్‍ మహిళలు, ఇతర అంశాల్లో తాలిబన్లు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతోంది. కానీ ఇప్పుడు చైనా, రష్యా వంటి దేశాలు తాలిబన్లతో ఒప్పందం చేసుకొంటే తాలిబన్లు అమెరికాలోని రిజర్వు నిధి కోసం పెద్దగా వెంపర్లాడరని నిపుణులు చెబుతున్నారు.

 

Tags :