అమెరికాలో విమాన ప్రమాదం... హాలీవుడ్ నటుడు

అమెరికాలో విమాన ప్రమాదం... హాలీవుడ్ నటుడు

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న జెట్‍ విమానం కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. వీరిలో నటుడు జోయ్‍ లారా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జోయ్‍ లారా టార్జన్‍ సిరిస్‍లతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. శనివారం టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. సౌత్‍ నాష్‍విల్లేలోని పెర్సీ స్ట్రీక్‍ లేక్‍లో విమాన శకలాలు కూలినట్లు ఫెడరల్‍ ఏవియేషన్‍ అడ్మినిస్ట్రేషన్‍ ప్రకటించింది. ఈ ఘటనలో చనిపోయిన వాళ్లలో నటుడు జోయ్‍ లారా, అతని భార్య గ్వెన్‍ ష్వాంబ్లిన్‍ ఉన్నారు.  ఈ దుర్ఘటనలో శకలాలు చెల్లాచెదురు అయ్యాయని, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Tags :