జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు

జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు

జాన్స్ క్రీక్‍ సిటీ కౌన్సిల్‍ ఎన్నికల్లో ముగ్గురు భారతీయ అమెరికన్లు పోటీ చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్‍ 2న జరిగే సిటీ కౌన్సిల్‍ ఎన్నికల్లో జాన్స్ క్రీక్‍ సిటీ కౌన్సిల్‍ నుంచి దిలీప్‍ తుంకీ, రష్మి సింగ్‍, బాబ్‍ ఎర్రమిల్లి అనే ముగ్గురు ఎన్నారైలు పోటీ పడుతున్నారు. వీరిలో దిలీప్‍ తుంకీ.. జాన్స్ క్రీక్‍ సిటీ కౌన్సిల్‍ పోస్ట్-1కు అర్హత సాధించగా, రష్మి సింగ్‍.. జాన్స్ క్రీక్‍ సిటీ కౌన్సిల్‍ పోస్ట్-2కు, బాబ్‍ ఎర్రమిల్లి.. జాన్స్ క్రీక్‍ సిటీ కౌన్సిల్‍ పోస్ట్-3కు అర్హత సాధించారు. తుంకీ 20 ఏళ్లుగా జాన్స్ క్రీక్‍లో నివాసముంటున్నారు. వ్యాపార రంగంలో ఆయనకు 27 ఏళ్ల అనుభవం ఉంది. స్థానికంగా ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు భార్య పద్మ, కూతురు సింధు ఉన్నారు. ఇక బాబ్‍ ఎర్రమిల్లి అమెరికన్‍ ఎయిర్‍ ఫోర్స్లో 20 ఏళ్లు పని చేసిన అనుభవం ఉంది. యూఎస్‍ మెరైన్‍ కార్పస్, నేవీ విభాగాల్లో ఆఫ్రికా, పర్షియన్‍ గల్ఫ్, ఆఫ్ఘనిస్తాన్‍లో పని చేశారు.  

దిలీప్‍ టుంకి 2019 లో జాన్స్ క్రీక్‍ సిటీ కౌన్సిల్‍ పోస్టస్ 2 కి పోటీ చేసి ఇటు డిబేట్స్ లో పాయింట్‍ టు పాయింట్‍ అదరగొట్టడమే కాక అటు క్లోజ్‍ ఎలక్షన్‍ తో రన్నాఫ్‍ వరకు తెచ్చి ప్రత్యర్థికి చెమటలు పుట్టించారు. బాబ్‍ ఎర్రమిల్లి. జెట్‍ స్పీడుతో నిర్ణయాలు తీసుకోగలిగిన వాళ్ళే ఎయిర్‍ ఫోర్స్ లో ఇమడగలరు అనే నానుడితో, 14 సంవత్సరాలు కంబాట్‍ జెట్స్ నడిపిన యోధుడు బాబ్‍ ఎర్రమిల్లి. తదనంతరం పూర్తి భిన్నమైన సాఫ్ట్వేర్‍ ఇంజనీర్‍ వ •త్తిలో రాణించడం విశేషం. రష్మీ సింగ్‍ సుమారు 20 సంవత్సరాలకు పైగా టెక్నాలజీ కంపెనీస్‍ లో నాయకత్వ విధుల్లో పనిచేసారు. ఒకవేళ ఈ ఎన్నికలలో గెలిస్తే జార్జియా రాష్టంలోనే మొట్టమొదటి భారతీయ అమెరికన్‍గా రెకార్డుల్లోకెక్కుతారు.

 

Tags :