భారత్‌, ఆస్ట్రేలియా 2G2 చర్చలు

భారత్‌, ఆస్ట్రేలియా 2G2 చర్చలు

భారత్‌, ఆస్ట్రేలియా దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. 2G2 విధానంలో జరిగిన ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పీటర్‌ డట్టన్‌, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి మేరీస్‌ పేన్‌ పాల్గొన్నారు.  చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తాలిబన్ల ఏలుబడిలో ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగం ఉగ్రవాదులకు స్వర్గధామం కారాదని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇతర దేశాలపై దాడుల కోసం ఆప్ఘన్‌ గడ్డపై నుంచి కార్యకలాపాలు ఎంతమాత్రం తగవని స్పష్టం చేశారు. ఆప్ఘన్‌లో ఏర్పడే ప్రభుత్వంలో అన్ని వర్గాలకు స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని భారత్‌, ఆస్ట్రేలియా ఉద్ఘాటించాయి. కల్లోభరిత పరిస్థితుల నడుమ చితికిపోయిన ఆఫ్గనిస్థాన్‌ ను వీడేందుకు అక్కడి పౌరులకు అవకాశం కల్పించాలని సూచించాయి.

 

Tags :