రూమర్స్ పై క్లారిటీ ఇస్తానంటున్న టిల్లు..!

రూమర్స్ పై క్లారిటీ ఇస్తానంటున్న టిల్లు..!

" డీజె టిల్లు " ఈ సినిమా సైలెంటుగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. సూర్యదేవర నాగవంశీ అత్యంత తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 50 కోట్లను రాబట్టింది.

దీంతో జొన్నలగడ్డ సిద్దు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాకి దర్శకుడు విమల్ కృష్ణే అయినా క్రెడిట్ మొత్తం హీరో సిద్దుకే దక్కింది అని చెప్పాలి. ఈ సినిమా సీక్వెల్ పై భారీగా అంచనాలు పెరిగాయి.

" డీజె టిల్లు " బ్లాక్ బస్టర్ కావడంతో , దీనికి సీక్వెల్ గా " టిల్లు స్క్వేర్ " ని రూపొందిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే ముందు నుంచే వివాదాలు చుట్టుముట్టాయి. ముందుగా ఈ సినిమా నుండి దర్శకుడు విమల్ కృష్ణ  తప్పుకున్నారు. విషయం ఏంటి అని అడుగగా, చేసిన సినిమానే మల్లి చేయలేను అని అన్నారు. తన ప్లేస్ లోకి మల్లిక్ రామ్ వచ్చారు.

ఇదిలా ఉండగా హీరోయిన్ గా ఉన్న నేహా శెట్టి ప్లేస్ ని అనుపమ పరమేశ్వరన్ రీప్లేస్ చేస్తున్నట్లు సమాచారం. రెగ్యులర్ షూటింగ్ మొదలైందంటూ ఈ టీం ఒక వీడియోని రిలీజ్ చేశారు. దీంట్లో పూజ హేగ్దే తో పాటు అనుపమపైన కూడా సిద్ధు జొన్నలగడ్డ పంచ్ వేసాడు.

తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ మూవీ నుండి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా తప్పుకున్నట్లు తెలుస్తుంది. విషయం ఏమిటి అని అడుగగా, తాను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి రీజన్ హీరో సిద్దు జొన్నలగడ్డ కారణం అని, సెట్స్ లో అతని తీరు నచ్చకే తాను తప్పుకున్నట్లు ఆమె అన్నారు.

ఇప్పుడు అనుపమ ప్లేస్ లో కొత్త హీరోయిన్ గా మడోన్నా సెబాస్టియన్ ని సెలెక్ట్ చేశారట. ఈ వార్తల పై సిద్ధు జొన్నలగడ్డ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్న ఒక స్టిల్ ని పోస్ట్ చేసిన సిద్ధు, ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించే సినిమాను మీకు అందిస్తాను అని ప్రామిస్ చేశాడు. ఈ చిత్రాన్ని మార్చి 2023 లో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు.

ఈ సినిమాపై వచ్చే రూమర్స్ మీద కూడా త్వరలోనే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తానని అయన తెలిపారు. రూమర్స్ పై సిద్దు ఎలా స్పందిస్తారు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సిద్దు పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

 

 

Tags :