ఆసియా పసిఫిక్ లోనే అతిపెద్ద జెపీ మోర్గాన్ క్యాంపస్ ప్రారంభం

ఆసియా పసిఫిక్ లోనే అతిపెద్ద జెపీ మోర్గాన్ క్యాంపస్ ప్రారంభం

హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ జెపీ మోర్గాన్‌ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. హైటెక్‌ సిటీలో సలార్‌పూరియా సత్వా నాలెడ్జ్‌ సిటీ వద్ద 8.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్‌ ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే అతిపెద్దది. భారత్‌ పెట్టుబడులు పెట్టాలనే నిర్ణయంలో భాగంగా ఈ జెపి మోర్గాన్‌ చేస్‌ను నిర్మించగా, ఇది బ్యాంక్‌ అంతర్జాతీయ కార్యకలాపాలను ఏకీకృతం చేయనుంది. జెపి మోర్గాన్‌ చేసే గ్లోబల్‌ సర్వీసెస్‌ హెడ్‌ డానియోల్‌ విల్కెనింగ్‌ మాట్లాడుతూ జెపి మోర్గాన్‌కు హైదరాబాద్‌ ఎంతో కీలకమైన ఫైనాన్షియల్‌, టెక్నాలజీ హబ్‌, భారత్‌ వృద్ధి కథలో ఇదొక అంతర్భాగమని అన్నారు. తమ క్లయింట్‌ అవసరాలకు అనుగుణంగా, ఉద్యోగులకు ప్రపంచ స్థాయి పని వాతావరణం అందించే దిశగా క్యాంపస్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే నగరంలో ఎంతో ప్రతిభా సామర్థ్యం కల్గినవారు ఉన్నరన్నారు. కంపెనీ క్యాంపస్‌ ఒక సమాజం దృష్టి, శ్రేయస్సు, నిలకడ, సహకారం అనే పిల్లార్స్‌పై నిర్మించారని అన్నారు. తీసుకునే ప్రతి నిర్ణయం ఉద్యోగుల అవసరాల మేరకు ఉంటాయని పని ప్రదేశం విస్తరణ భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని అన్నారు.

 

Tags :