అన్నా! ఇరగదీసావ్!! అంటూ కళ్యాణ్ రామ్ ను 'బింబిసార' మూవీ టీం ని అభినందించిన ఎన్టీర్

అన్నా! ఇరగదీసావ్!! అంటూ కళ్యాణ్ రామ్ ను 'బింబిసార' మూవీ టీం ని అభినందించిన ఎన్టీర్

నందమూరి కళ్యాణ్ రామ్  హీరోగా తెరకెక్కిన మూవీ బింబిసార . నందమూరి కళ్యాణ్ రామ్  లేటెస్ట్ మూవీ బింబిసార  నేడు శుక్రవారం (ఆగస్టు 5) ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కళ్యాణ్ రామ్ చాలా రోజుల తరువాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడని ఇండస్ట్రీ జనం అంటున్నారు.  సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. బాక్సాఫీసు వద్ద మంచి పాజిటివ్ టాక్‌తో థియేటర్స్‌లో రన్ అవుతోంది. డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ్ మేకింగ్‌కు నందమూరి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా  బింబిసార మూవీపై యంగ్ జూనియర్ ఎన్టీఆర్  ట్వీట్ చేశాడు. 'బింబిసార మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ సినిమాను బాగా ఆస్వాదిస్తున్నారు. ప్రేక్షకులకుథియేటర్ కి  నచ్చినప్పుడే మంచి అనుభూతి కలుగుతుంది. కళ్యాణ్ రామ్ అన్న బింబిసార రాజుగా నువ్వు తప్ప ఈ క్యారెక్టర్‌ను ఎవరూ భర్తీ చేయలేరు. డైరెక్టర్ విశిష్ఠ్ అనుభవం దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. ది లెజండరీ ఎంఎం కీరవాణిగా బింబిసార సినిమాకు వెన్నెముకగా నిలిచింది. ఈ మూవీని విజయవంతమైనందుకు నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు..' అంటూ తారక్ ట్వీట్ చేశాడు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో.. టైమ్ ట్రావెల్ పాయింట్‌తో తెరకెక్కిన బింబిసార మూవీ అభిమానుల అంచనాలను అందుకున్నట్లే కనిపిస్తోంది. సినిమా చూసిన ఆడియన్స్.. బింబిసార సూపర్ హిట్ అంటున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. బింబిసారకు పాజిటివ్ టాక్స్ రావడంతో చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. నందమూరి అభిమానులు ఓ రేంజ్‌లో సంబరాలు చేసుకుంటున్నారు.

Jr NTR Tweet:

https://twitter.com/tarak9999/status/1555440987983708160

 

 

Tags :