సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ మిశ్ర, విశ్వనాథన్ ల ప్రమాణం

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌లు పదవీ ప్రమాణం చేశారు. కోర్టు పనివేళల ప్రారంభానికి ముందు సుప్రీం కోర్టు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వారిద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఇద్దరు న్యామూర్తుల నియామకంతో సుప్రీంకోర్టు జడ్జీ సంఖ్య పూర్తి స్థాయిలో 34కి చేరింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర 2021 అక్టోబర్ 13 నుంచి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తూ వచ్చారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, న్యాయమూర్తిగా సేవలందించారు. సీనియర్ అడ్వొకేట్ కేవీ విశ్వనాథన్ బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇలా నియమితులైన వారిలో ఆయన 10వ వ్యక్తి.