తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్  సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్‌ సతీష్‌చంద్ర ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనకు గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 1961 నవంబర్‌ 30న జన్మించారు. హరిసింగ్‌గౌర్‌ యూనివర్సిటీ నుంచి 1984లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేయడంతో పాటు మూడు బంగారు పతకాలు సాధించారు. 1984 సెప్టెంబర్‌ 1న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొన్న ఆయన 2003లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు. 2004లో కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ప్యానల్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2008లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2010 శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి  పొందారు. జనవరి 4న కర్ణాటక న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. గత ఆగస్టు 31 నుంచి కర్ణాటక హైకోర్టులో తాతాలిక సీజేగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

.

Tags :