తెలంగాణకు కాబోయే సీఎం నేనే

తెలంగాణకు కాబోయే సీఎం నేనే

తాను తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ చెప్పారు. తిరుమతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని కేసీఆర్‌ కాచుకో వస్తున్నా అంటూ ఆయనకు సవాల్‌ విసిరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ పార్టీలతో విరక్తి చెందిన ప్రజలు ఈసారి ప్రజాశాంతి పార్టీకి పట్టంగట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.  ఏపీలో ఓ మహిళను ముఖ్యమంత్రిని చెస్తానని చెప్పారు. వైసీపీ పాలకులు రాష్ట్ర పరిస్థితిని శ్రీలంక, సూడాన్‌, నైజీరియా, జింబాబ్వేలా మార్చేశారని విమర్శించారు. వైసీపీకి 175 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

 

Tags :