ప్రపంచ శాంతి దూత వస్తే... సెక్యూరిటీ లేదా?

ప్రపంచ శాంతి దూత వస్తే... సెక్యూరిటీ లేదా?

ప్రపంచ శాంతి దూత వస్తే కనీస సెక్యూరిటీ లేదా? అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి చేసిన గుండాలను అరెస్ట్‌ చేయరా అని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులు, నిరుద్యోగులకు వ్యతిరేకమని అన్నారు. సిగ్గుంటే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కి వెళ్లిపోవాలన్నారు. హుజురాబాద్‌లో ఓడిపోయినా కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి రాదా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులు పండిరచిన మొత్తం ధాన్యాన్ని కొనాలని డిమాండ్‌ చేశారు.

 

Tags :