MKOne TeluguTimes-Youtube-Channel

అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్

అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చేసిన కామెంట్లకు మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని, మ్యాన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నారు.  శ్రీధర్‌ రెడ్డిని చంద్రబాబు మ్యాన్‌ ట్యాపింగ్‌ చేశారన్నారు. కోర్టులో కేసు వెస్తానన్నావ్‌ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్నావ్‌ ఏమైందని ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థిగా ఖరారై వచ్చాక శ్రీధర్‌ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు.  2014లో మనమంతా ఎవరం అని ప్రశ్నించారు.  జగన్‌ పుణ్యం కారణంగానే మనం గెలిచామన్నారు.  జగన్‌కు అనుమానం ఉంటే శ్రీధర్‌ రెడ్డికి బాధ్యతలు అప్పంచేవారా అని ప్రశ్నించారు.  వైసీపీని చంద్రబాబు భూస్థాపితం చేస్తామన్నారని, అయినా జగన్‌ ఎక్కడా భయపడలేదన్నారు. అరెస్ట్‌లు ఎన్‌ కౌంటర్లు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఒకవేళ పోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనుకుంటే  కోర్టకైనా వెళ్చొచ్చు, కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. ట్యాపింగ్‌ ఆరోపణలు నిజమాÑ కాదా? శ్రీధర్‌ రెడ్డి రుజువు చేయాలన్నారు.

 

 

Tags :