సిక్కోలుకు లభించిన అరుదైన గౌరవం...అమెరికాలో

సిక్కోలుకు లభించిన అరుదైన గౌరవం...అమెరికాలో

భారతదేశం తరపున అమెరికాలో 12 ప్రదర్శనలు ఇచ్చేందుకు కళానికేతన్‌ శ్రీకాంత్‌ బృందం ఎంపికైంది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం సిక్కోలుకి  దక్కడం ఒక చారిత్రక ఘట్టం. అజాదీ కీ అమృత్‌ మహోత్సవంలో వందేభారతం పేరిట నిర్వహించిన  నాట్య పోటీలలో శ్రీకాంత్‌ రఘుపాత్రని శిష్య బృందం విజయం సాధించి 2022 ఢిల్లీ గణతంత్ర దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకొంది. 12 మంది శిష్యులు అక్కడ అత్యుత్తమ బృందాలలో ఒకటిగా నిలిచి జూలై 1 నుంచి 23 వరకు అమెరికాలో ప్రదర్శలిచ్చే అవవకాశాన్ని భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్నీ శ్రీకాంత్‌ శిష్య బృందం దక్కించుకున్నారు.

వాషింగ్టన్‌ డీసీ, అట్లాంటా, ఫ్లోరిడా, పనామా, తాంపా, చికాగో రాష్ట్రాల్లో 12 నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. భారత ప్రభుత్వం ఐసీసీఆర్‌,  వందేభారత్‌ మిషన్‌, మినిష్టరీ ఆఫ్‌ కల్చర్‌ ఈ బృందానికి అమెరికాలో ప్రదర్శనలు ఇవ్వడానికి సిద్ధం చేశారు. రామకౌండిన్య, బాల చందర్‌, నేహా పట్నాయక్‌, గాయత్రి వర్షిత, వెన్నెల, మనోజ్ఞ, లక్ష్మీ ప్రభ, నేహాధామస్‌, హిమ బిందు, ప్రవల్లిక, సాహిత్య, గౌ. డా.శ్రీకాంత్‌ రఘుపాత్రని శిష్య బృందం భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

Tags :