ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వనిర్ణయం సరైంది కాదు... మేము ఖండిస్తున్నాం!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వనిర్ణయం సరైంది కాదు... మేము ఖండిస్తున్నాం!

ఇది హుందాతనం అనిపించుకోదు!! : నందమూరి కళ్యాణ్ రామ్, నారా రోహిత్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ  పేరు మార్పుపై నందమూరి హీరోలు వరుసగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం సరికాదంటు సోషల్ మీడియా వేదికగా ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ  పేరు మార్పుపై పెద్ద రచ్చ జరుగుతోంది. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి హీరోలు వరుసగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం సరికాదంటున్నారు. విజయవాడలో ఉన్న డా.ఎన్టీఆర్‌ హెల్త్ యూనిమర్సిటీ పేరును డా.వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లును ఏపీ శాసనసభ బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై హీరో నందమూరి కళ్యాణ్ రామ్  స్పందించారు. '1986లో విజయవాడలో మెడికల్‌ యూనివర్శిటీ స్థాపించబడింది.

ఆంధ్రప్రదేశ్‌లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న ఎన్టీఆర్‌ గారు ఈ మహావిద్యాలయనికి అంకురార్పణ చేశారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది. లెక్కలేనన్ని వైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది. తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అని పేరు మార్చబడింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకుపైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు..' అంటూ సోషల్ మీడియో పోస్ట్ పెట్టాడు. మరో హీరో నారా రోహిత్  ప్రభుత్వం నిర్ణయంపై కొంచె ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. 'రాజకీయ కారణాలతో మహనీయుల పేర్లు మార్చటం హుందాతనం కాదు. NTR స్థాయిలో మరొకరు లేరు, రారు. ఆయన పేరు మార్చాలి అంటే తిరిగి ఆయన పేరే పెట్టాలి. ఇలాంటి పనులతో మీ స్థాయి దిగజారుతోంది తప్పితే ఆయన స్థాయికి ఏమి కాదు. జోహార్ NTR..!' అంటూ రాసుకొచ్చాడు. 

https://twitter.com/NANDAMURIKALYAN/status/1572898046936956928

https://twitter.com/IamRohithNara/status/1572930651581714436

 

 

Tags :