సంతోష్ శోభన్, యూవీ కాన్సెప్ట్స్ "కళ్యాణం కమనీయం" టైటిల్ మోషన్

సంతోష్ శోభన్, యూవీ కాన్సెప్ట్స్ "కళ్యాణం కమనీయం" టైటిల్ మోషన్

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. తాజాగా కళ్యాణం కమనీయం సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ టైటిల్ మోషన్ పోస్టర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ప్లెజంట్ విజువల్స్ కు అంతే అందమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంది. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మిస్తూ యువ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రంతో మరో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Tags :