రీరిలీజ్ కి రెడీ అవుతున్న ప్లాప్ మూవీ...

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తమిళంలో 22 ఏళ్ల క్రితం వచ్చిన "ఆళవంధాన్" సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎస్ థాను అప్పట్లోనే భారీ బడ్జెట్ తో రూపొందించారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఈ సినిమాలో హీరోగా నటించారు.
ఇదే సినిమాని తెలుగు లో "అభయ్" అనే పేరుతో థియేటర్లలో విడుదలైంది. దేశ వ్యాప్తంగా అభయ్ ను దాదాపు వెయ్యికి పైగా స్క్రీన్స్ లో రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర దర్శక నిర్మాతలు అఫిషియల్ గా ప్రకటించడం జరిగింది. ఇక ఈ న్యూస్ తో కమల్ ఫాన్స్ అభయ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పట్లో ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కు గాను అవార్డు వచ్చింది.
అసలు విషయానికి వస్తే అప్పట్లో ఈ సినిమా కమల్ హాసన్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. ఒకప్పుడు ప్లాప్ అయిన సినిమాని మళ్ళీ ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇప్పటి ప్రేక్షకులకు ఈ సినిమా అన్ని విధాలుగా నచ్చుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ప్రెజెంట్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సౌండ్, పిక్చర్ క్వాలిటీ మార్చి రీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రీ రిలీజ్ డేట్ ను ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. ఈసారైనా అభయ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.