కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ : యూఎస్ ట్రిప్ తరువాత....

కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ : యూఎస్ ట్రిప్ తరువాత....

యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. యూఎస్ ట్రిప్ నుంచి వచ్చాను..ఆరోగ్యం కాస్త సహకరించలేదు.. జలుబు, దగ్గు వచ్చిందని చెప్పుకొచ్చాడు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. యూఎస్ ట్రిప్ నుంచి వచ్చాను..ఆరోగ్యం కాస్త సహకరించలేదు.. జలుబు, దగ్గు వచ్చింది. దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాను.కరోనా పాజిటివ అని తేలింది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. అంతా బాగానే ఉంది. ఎవ్వరూ ఆందోళన పడొద్దు అని అభిమానులకు కమల్ హాసన్ సందేశాన్ని అందించాడు. త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తరువాత జరగబోయే పరిణామాలు ఏంటని అభిమానులు ఆలోచిస్తున్నారు.

ఎందుకంటే బిగ్ బాస్ షోతో కమల్ హాసన్ బిజీగా ఉన్నాడు. అలా క్వారంటైన్‌కు పరిమితమైన కమల్ హాసన్ ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించడం అసాధ్యం. మరి బిగ్ బాస్ షోను ఈ వారం నడిపేది ఎవరు? అని కొంత మంది నెటిజన్లు అనుమానాలను వెల్లిబుచ్చుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకో వైపు విక్రమ్ సినిమా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొన్నీ మధ్యే విక్రమ్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా వదిలిన చిన్న పాటి టీజర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ స్టైలీష్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించడంతో, ఆ టీజర్లోని యాక్షన్ సీక్వెన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కూడా క్యాన్సిలో అయినట్టే. మొత్తానికి కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 

Tags :