సియాటేల్ నగరం లో LV టెంపుల్ లో కనక దుర్గ పూజలు..

సియాటేల్ నగరం లో LV టెంపుల్ లో కనక దుర్గ పూజలు..

వాషింగ్టన్ రాష్ట్రం లో సియాటెల్ నగరం లో అందరికి తెలిసిన లక్ష్మి వేంకటేశ్వర దేవాలయం (LV Temple) లో  గురువారం, 16 జూన్ నుంచి శనివారం, 18 జూన్ వరకు కనక దుర్గ పూజలు జరపటానికి విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానం నుంచి పురోహితులు వచ్చి అమ్మవారిని సాక్షాత్కరించి కుంకుమ పూజలు చేయటం చాలా విశేషం అని LV టెంపుల్ నిర్వాహకులు డా. దీక్షిత్ పరాశరం అన్నారు.

16, 17 జూన్ తేదీలలో కుంకుమ పూజలకి, శనివారం, జూన్ 18 వ తేదీన శివ పార్వతి కళ్యాణం కి ఇంత మంది వచ్చి అమ్మవారి పూజలలో పాల్గొని జయప్రదం చేశారని LV టెంపుల్ చైర్మన్ శ్రీమతి సాయి మద్దూరి అన్నారు.

విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానం నుంచి అమ్మవారు మా గుడి కి రావటం, అన్ని పూజలు ఘనం గా జరగటం ఆనందం గా వుందని టెంపుల్ డైరెక్టర్ శ్రీ రమేష్ జోస్యుల అన్నారు.

ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రవేశ పెట్టిన e హుండీ, e డోనేషన్, పరోక్ష సేవ, మా వూరు మా గుడి పథకాలను, దేవాదాయ శాఖ ఎన్ అర్ ఐ విభాగ సలహాదారు శ్రీ వేంకట సుబ్బా రావు చెన్నూరి భక్తులకు వివరించారు. దుర్గ గుడి కూడా భక్తులకు మరిన్ని సేవలు అందించేందుకు, మరిన్ని సౌకర్యాలు కలిగించేందుకు పనులు మొదలెట్టింది అని ఆ ప్రాజెక్ట్ లలో కూడా ఎన్ అర్ ఐ లు విరాళాలు ఇవ్వచ్చని వివరించారు.

 

Click here for Durga Pujalu Photogallery

Click here for Shiva Parvati Kalyanam Photogallery

 

 

Tags :