ఏ కోర్టుకు వెళ్లినా రాజధాని మారదు : కనకమేడల

ఏ కోర్టుకు వెళ్లినా రాజధాని మారదు : కనకమేడల

రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా అమరావతి నుంచి రాజధాని మారదని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. కృష్ణా జిల్లాలో కొనసాగుతోన్న రైతుల మహాపాదయాత్రలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో కలిసి కనకమేడల పాల్గొన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర రాష్ట్ర ప్రజలను మేల్కొల్పేలా సాగుతోందన్నారు. రాజధానిపై హైకోర్టు తీర్పు అమలు చేయకుండా కాలయాపన చేసి 6 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని మండిపడ్డారు.  ఏ కోర్టుకు వెళ్లినా అమరావతి నుంచి రాజధాని మారే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.

 

Tags :