అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలో ... తెలంగాణ యువకులు

అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలో ...  తెలంగాణ యువకులు

టార్గెట్‌ బాల్‌ పోటీల్లో జిల్లా యువకులు మెరిశారు. జిల్లాలోని పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన యువకులు ఉమా శంకర్‌, అశోక్‌ టార్గెట్‌ బాల్‌ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో వచ్చే జులై నెలలో జరిగే ఫెడరేషన్‌ కప్‌ పోటీలలో భారతదేశం తరపున వీరు పాల్గొంటారని టార్గెట్‌ బాల్‌ అసోసియేషన్‌ తెలంగాణ సెక్రటరీ రేవంత్‌ కుమార్‌, మహబూబ్‌ నగర ప్రెసిడెంట్‌ వి. నరసింహ తెలిపారు. గత ఏప్రిల్‌లో ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జరిగిన జాతీయ టార్గెట్‌ బాల్‌ పోటీలలో అంత్యంత ప్రతిభ కనబర్చడంతో తాము ఎంపికైనట్లు ఉమా శంకర్‌ చెప్పారు. అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడానికి నిరుపేద కుటుంబానికి చెందిన తమకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.

 

Tags :