ఏపీకి విశాఖే రాజధాని.. వచ్చే ఏడాది మార్చి నుంచి

ఏపీకి విశాఖే రాజధాని.. వచ్చే ఏడాది మార్చి నుంచి

ఆంధ్రప్రదేశ్‌కు విశాఖే రాజధాని కేంద్రమని, వచ్చే ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ తెలిపారు. అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులుప్పాడలో ఉన్నతాధికారులు, వివిధ సంస్థలకు స్థలాలు కేటాయిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిని వదిలి పెట్టబోమన్నారు. అమరావతికి తాము వ్యతిరేకంగా కాదని, పారిపలనా రాజధాని విశాఖలో ఉంటే వారికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. రాజధానిపై టీడీపీ, జనసేన పార్టీలు రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నాయని విమర్శించారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.