ఏపీ ప్రభుత్వ విప్‌గా ధర్మశ్రీ బాధ్యతల స్వీకరణ

ఏపీ ప్రభుత్వ  విప్‌గా ధర్మశ్రీ బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రభుత్వ విప్‌గా అమరావతిలో బాధ్యతలు స్వీకరించారు.  వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ధర్మశ్రీ తన సతీమణి విజయతో కలిసి కార్యాలయంలో తొలిసారిగా అడుగుపెట్టారు. కార్యాలయంలో పూజల ఆనంతరం తన సీటులో కూర్చున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

 

Tags :